ప్రధాని మోడి దౌత్యనీతికి అద్దం పట్టిన ట్రంప్ పర్యటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత పర్యటన విజయవంతంగా ముగిసింది. భారత్, అమెరికా సంబంధాలు బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా సాగిన ఈ పర్యటన రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం బలపడేందుకు దోహదం చేసింది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోడి దౌత్యనీతి, ప్రపంచ దేశాల్లో భారతదేశ గౌరవాన్ని, ఇనుమడింపచేసిన పర్యటన ఇది. హౌడి-మోడి, నమస్తే ట్రంప్