పారిశ్రామికవేత్త, విద్యావేత్త, రాజకీయవేత్త అయిన యలమంచిలి సత్యనారాయణ చౌదరి గారి జీవితం అనేక రంగాల్లో విస్తరించింది.
2010లో మొదటిసారిగా రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన చౌదరిగారు ఆ పదవిలో 2022 వరకు కొనసాగారు. 2014-2018 మధ్య కాలంలో కేంద్రంలోని నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ (NDA) ప్రభుత్వంలో శాస్త్ర, సాంకేతిక, పరిశోధనలు, సామాజిక శాఖా మంత్రిగా పనిచేశారు.

తన రాజకీయ జీవితంలో మొదటిసారిగా, శ్రీ చౌదరి 2024లో ప్రత్యక్ష ఎన్నికలలో పాల్గొని, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు.
సామాజిక బాధ్యత మరియు ఆర్థిక చతురత యొక్క లోతైన భావంతో నిండిన శ్రీ చౌదరి వ్యాపార మరియు రాజకీయాలకు అతీతంగా అనేక రకాల కార్యకలాపాల ద్వారా సమాజ అభివృద్ధికి కృషి చేస్తూనే ఉన్నారు.
తీవ్రమైన వ్యాపార మరియు రాజకీయ పోటీ ప్రపంచంలో శ్రీ యలమంచిలి సత్యనారాయణ చౌదరి గారు తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. చౌదరి గారి కుటుంబంలోని వారంతా ప్రభుత్వ కార్యాలయాలలో గౌరవమైన పదవులలో ఉన్నప్పటికీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తరువాత ఆయన ఉద్యోగాల వైపు వెళ్లలేదు. చౌదరి గారు ఉద్యోగ కాంక్షకంటే ఉపాధి కల్పనా వైపే ఎక్కువ మొగ్గు చూపారు. ఆనాటి పరిస్థితుల్లో ఉపాధి కల్పనకు గల ప్రాముఖ్యతను, సత్వర అవసరాన్ని గ్రహించిన చౌదరి గారు, తన వ్యాపార ప్రస్థానాన్ని మొదలుపెట్టి, తన కృషి పట్టుదలతో ఒక పారిశ్రామిక సామ్రాజ్యాన్ని స్థాపించారు.
మరింత చదవండి