తన ఆలోచనా విధానానికి అనుగుణంగా విద్యాభ్యాసం పూర్తయిన వెంటనే కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారంతో 1986లో తన తొలి వ్యాపార సంస్థను స్థాపించారు. ఈ కంపెనీ సీలింగ్ ఫ్యాన్లు, పెడస్టల్ ఫ్యాన్లు వంటి గృహోపకరణాలను తయారు చేసి, మధ్య తరగతి అవసరాల్ని తీర్చింది. అదేవిధంగా LED లైటింగ్, రిమోట్ ఫ్యాన్లు, పవర్ కన్సూమర్ పరికరాలు ఉత్పత్తులను తయారు చేయడంలో త్వరలోనే ప్రసిద్ధి గాంచింది.
In tune with this thinking, Shri YS Chowdary, soon after completing education, founded Sujana Group in 1986 with the support of the family and friends. Initially, the Sujana project began as a modest enterprise, manufacturing domestic appliances like ceiling fans and pedestal fans. The company ventured into manufacturing a range of groundbreaking products such as LED lighting, remote-controlled fans, and power-saving equipment.
కాలక్రమేణా సుజనా గ్రూప్ ఇనుము, విద్యుత్, టెలికాం, ఆయిల్, లైట్ ఇంజనీరింగ్, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, ట్రేడింగ్ సహ వివిధ రంగాలలో వేగంగా విస్తరించింది. గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అనుబంధ సంస్థలుగా సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, స్ప్లెండిడ్ మెటల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, నియాన్ టవర్స్ లిమిటడ్ ఏర్పడ్డాయి.
చౌదరి గారి కృషితో సుజనా గ్రూప్ త్వరితగతిన విస్తరించింది.
శ్రీ చౌదరి గారు 2001 నుండి 2014 వరకు మెదక్ జిల్లా ఘనాపూర్ విలేజ్ లోని మెడిసిటి మెడికల్ కాలేజ్, హస్పిటల్, నర్సింగ్ కాలేజ్ నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థ షేర్ మెడికల్ కేర్ తో కూడా అనుబంధం కొనసాగించారు.
Shri Chowdary has also been associated with Share Medical Care (SMC), a charitable society that operated Mediciti Medical College, Hospital, and Nursing institutions in Ghanpur Village, Medak District from 2001 to 2014.
సుజనా గ్రూప్ సంస్థలలో 10 వేల కంటే ఎక్కువ మందికి గ్లోబల్ ఫుట్ ప్రింట్ ద్వారా దేశవ్యాప్తంగా ఉపాధి కల్పించబడుతుంది.
సుజనా గ్రూప్ సంస్థ కార్పొరేట్ క్రమశిక్షణతో కొనసాగుతోంది. సంస్థ చట్టబద్ధంగా పన్ను చెల్లింపులు, వార్షిక ఆదాయ, లాభ నష్టాల ప్రకటనలకు వెల్లడించటంలో నిబంధనలకు కట్టుబడి ఉంది. శ్రీచౌదరి గారు స్వభావరీత్యా వివాదాలకు ఎప్పుడూ దూరంగా ఉండటానికే ఇష్టపడతారు. చౌదరి గారు కంపెనీలు స్థాపించినప్పటి నుండే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో ఎటువంటి వ్యాపార లావాదేవీలపై సంబంధాలు ఉండకూడదని నిర్ణయించుకున్నారు.
అందులో భాగంగానే చౌదరి గారి గ్రూప్ సంస్థలు, కంపెనీలు, వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వాల నుండి ఎటువంటి సహయంగానీ, గ్రాంట్లు, సబ్సిడీలు, మినహాయింపులు, భూములు కేటాయింపులను కోరలేదు. గ్రూప్ లోని అన్ని సంస్థలలో కుల, మత, ప్రాంతం వంటి వాటికి అతీతంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించటం జరిగింది. సుజనా గ్రూప్ సంస్థలలో వేలాది మందికి గడిచిన మూడు దశాబ్దాలకి పైగా ఉపాధి లభించింది. వివిధ సామాజిక వర్గాలు, పేద, మద్య తరగతి, ఉన్నత విద్యాభ్యాసం చేసిన వారికే ఉద్యోగ, ఉపాధి కల్పించటం జరిగింది.
శ్రీ చౌదరి గారు 2003 నుండి సుజనా గ్రూప్ సంస్థలలో నాన్ - ఎగ్జిక్యూటివ్ పదవులలో ఉన్నారు. కేంద్ర మంత్రిమండలిలో సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు 2014 అక్టోబర్ లో సంస్థలలోని అన్ని డైరెక్టర్ పదవులకు రాజీనామ చేశారు. ఆ బాధ్యతలను కో-ప్రమోటర్లలో ఒకరైన శ్రీ శ్రీనివాసరాజుకు అప్పగించారు.
ప్రస్తుతం చౌదరిగారు వైద్య, ఆరోగ్య రంగాలు, EV మొబిలిటి రంగాలలో వర్థమాన వ్యవస్థాపకులకు మార్గదర్శకం చేస్తూ వారిని కంపెనీల స్థాపనకు ప్రోత్సాహిస్తున్నారు.
కాలక్రమేణ మారుతున్న పరిణామాలు, బహిరంగ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా సుజనా గ్రూప్ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగుతోంది. ఇప్పటికే గ్రూప్ చాలా వ్యాపారాల నుండి వైదొలిగింది. శ్రీచౌదరి గారు ఇప్పుడు ప్రెడిక్టివ్ హెల్త్, ప్రివెంటివ్ మెడిసిన్, ఎలక్ట్రిక్ వెహికల్, మొబిలిటి టెక్నాలజీ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలపై దృష్టి పెట్టి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మార్గదర్శిగా నిలుస్తున్పారు.