చౌదరి గారి కుటుంబ సభ్యులెవరూ సుజనా గ్రూప్ ఆఫ్ కంపెనీల నిర్వహణలో లేరు. గ్రూప్‌లోని అన్ని కంపెనీలు నిష్ణాతులైన నిపుణులచే నిర్వహించబడుతున్నాయి. గ్రూప్ లోని లిస్టెడ్ కంపెనీల బోర్డులన్నీ వివిధ రంగాలలోని ప్రముఖ స్వతంత్ర డైరెక్టర్లతోనే కొనసాగుతున్నాయి. గ్రూప్‌లోని అన్ని కంపెనీలు అత్యున్నత స్థాయి కార్పొరేట్ గవర్నెన్స్‌ని అనుసరిస్తున్నాయి.
గ్రూప్‌లోని అన్ని కంపెనీల రికార్డులు, లావాదేవీలను ROC, SEBI, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక్సైజ్ తదితర చట్టబద్ధమైన సంస్థల ద్వారా క్రమం తప్పకుండా తనిఖీలు, పరిశీలనలు చేయబడుతున్నాయి.
సుజనా గ్రూప్ చరిత్రలో కంపెనీల నిబంధనలకు వ్యతిరేకంగా ఎన్నడూ ఉల్లంఘనలు జరిగిన దాఖలాలు లేవు. గ్రూప్ ఆఫ్ కంపెనీల జాబితా లిస్టెడ్ కంపెనీల వార్షిక నివేదికలలో ప్రచురించబడుతుంది. అంతేకాదు గ్రూపు సమాచారం ప్రతి సంవత్సరం నవీకరించబడుతున్నాయి.
గ్రూప్ కంపెనీలు నిర్వహణ ఎప్పుడూ అత్యున్నత స్థాయి కార్పొరేట్ విలువలతో, క్రమశిక్షణ కలిగిన ప్రవర్తనా నియమావళితో, నిబద్దతతో నిర్వహించబడుతున్నాయి.
చౌదరి గారు అన్ని నిబంధనలకు కట్టుబడి ఉన్నప్పటికీ, మీడియాతోపాటు సామాజిక మాధ్యమాలలో నిరాధార సమాచారం పొందుపరుస్తున్నారు. సీబీఐ, ఈడి వంటి వివిధ కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు కూడా ధృవీకరించని, సంబంధంలేని ఆరోపణలు, అపొహలను శ్రీ వైఎస్ చౌదరి గారి పై నిందలుగా మోపుతున్నాయి.
వాస్తవానికి ఈ ఆరోపణలు అన్నీ చెన్నైలోని M/s బెస్ట్ & క్రాంప్టన్ ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ (BCEPL) సంస్థ రుణాల మోసానికి సంబంధించినవి.
22.04.2019 నుండి 27.04.2019 వరకు చెన్నైకు చెందిన M/s బెస్ట్ & క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ (BCEPL)కు రుణాలకు సంబంధించిన 4(ఇ)2017 కేసులో సిఆర్‌పిసి సెక్షన్ 160 కింద శ్రీ వైఎస్ చౌదరి గారిని సిబిఐ విచారణకు పిలిపించింది. వాస్తవానికి చౌదరి గారు M/s BCEPL కంపెనీలో వాటాదారుగా కానీ, ఉద్యోగిగా కానీ, బిజినెస్ అసోసియేట్ గా కానీ, డైరెక్టర్ గా కానీ ఎటువంటి సత్సంబంధాలు లేవు.
వాస్తవానికి చెన్నైకు సంబంధించిన బెస్ట్ & క్రాంప్టన్ ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కేసులో బెంగళూరులోని సీబీఐ తనకు జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ శ్రీ చౌదరి తెలంగాణ హైకోర్టును కూడా ఆశ్రయించారు. BCEPLలో వాటాదారుగా, డైరెక్టర్, ఇతరత్ర పదవులలో తాను లేనని, కంపెనీతో తనకు ఎటువంటి సంబంధం లేదని చౌదరి గారు వేసిన పిటీషన్ లో పేర్కొన్నారు.
వ్యక్తిగత పూచీకత్తు విషయంలో తప్ప, బ్యాంకులు గానీ, ఆర్థిక సంస్థలు గానీ, వైఎస్ చౌదరి గారు మరియు సుజనా గ్రూప్ కంపెనీలపై ఎటువంటి ఫిర్యాదులు కానీ, FIR గానీ నమోదు కాలేదు.
వ్యక్తిగత పూచీకత్తు విషయంలో తప్ప, బ్యాంకులు గానీ, ఆర్థిక సంస్థలు గానీ, వైఎస్ చౌదరి గారు మరియు సుజనా గ్రూప్ కంపెనీలపై ఎటువంటి ఫిర్యాదులు కానీ, FIR గానీ నమోదు కాలేదు.
చౌదరి గారి పై లుక్-అవుట్ సర్క్యులర్ (LOC) సమస్య తలెత్తలేదు. నవంబర్ 2020లో చౌదరి గారు USAకి ప్రయాణిస్తున్నప్పుడు ఈ విషయం పరిగణలోకి రావటంతో గౌరవనీయ తెలంగాణా హైకోర్టును సంప్రదించారు. తనపై వచ్చిన LOC నియంత్రణ న్యాయస్థానంలో చౌదరి గారు సవాలు చేయటం జరిగింది. YS చౌదరి గారు సమర్పించిన విదేశీ పర్యటనల ప్రణాళిక ప్రకారం ప్రయాణాలకు అనుమతిస్తూ గౌరవ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.
కేసుకు సంబంధించి ప్రశ్నలు, జవాబులు. క్లుప్తంగా వివరణ